వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం – Moviezupp

Emma

Updated on:

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం.

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 5 గా తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. లోకేష్ ముత్తుముల , దీపికా వేమిరెడ్డి హీరో హీరోయిన్లుగా పార్థు రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు జానీ బాషా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కారే సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు విశ్వంభర రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం
వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

యూత్ ఫుల్ లవ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. త్వరలో చిత్ర టైటిల్ ను యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమాను అయినా ఆదరిస్తున్నారు. అందరికి కనెక్ట్ అయ్యే విధంగా మేము ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాము. దర్శకుడు జానీ బాషా చెప్పిన పాయింట్ యూనిక్ గా ఉంది, త్వరలో పూర్తి వివరాలు తెలుపుతామని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు.


Leave a Comment